: ఇంజిన్ నుంచి విడిపోయిన కృష్ణా ఎక్స్ ప్రెస్ బోగీలు


సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన తర్వాత, రైలు నుంచి రెండు బోగీలు విడిపోయి... రైల్వే బ్రిడ్జిపై నిలిచిపోయాయి. కప్లింగ్ ఊడిపోవడం వల్లే బోగీలు విడిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు. పెనుప్రమాదం తప్పడంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News