: నిత్యవ్యాయామంతో డిమెన్షియా దూరం


ప్రతినిత్యం క్రమం తప్పకుండా కచ్చితమైన వ్యాయామం చేస్తుండడం అనేది లేటు వయసులో డిమెన్షియా దరిచేరకుండా కాపాడుతుందని 35 ఏళ్లపాటూ కొనసాగిన ఒక అధ్యయనం తేల్చిచెబుతోంది. ప్రతినిత్యం క్రమం తప్పని వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండడం, తక్కువ బరువు కలిగి ఉండడం, ఆరోగ్యకరమైన భోజనం, తక్కువ ఆల్కహాల్‌ స్వీకరించడం అనే అయిదు లక్షణాలు వ్యాధులు సోకని అత్యంత ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి సరైన పునాదులు వేస్తాయని ఈ అధ్యయనం తేల్చిచెబుతోంది.

ఈ అయిదు ఆరోగ్యసూత్రాలను పాటించే వారిలో లేటు వయసులో కనిపించే ఆరోగ్య సమస్య డిమెన్షియా 60 శాతం దూరం అవుతున్నట్లు తేలిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే డయాబెటీస్‌, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు లాంటివి కూడా ఇతరులతో పోలిస్తే.. ఇలాంటి వారిలో బాగా తగ్గాయిట. అల్జీమర్స్‌ డే సందర్భంగా వెల్లడైన గణాంకాల్లో ప్రపంచ వ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడుతున్న వారి సంఖ్య 2050 నాటికి 135 మిలియన్లు చేరుకుంటుందని అంచనా. అలాంటి నేపథ్యంలో ఇలాంటి చిన్న జాగ్రత్తలు డిమెన్షియాను దూరం చేస్తాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ పీటర్‌ ఎల్‌వుడ్‌ చెబుతున్నారు. ఆయన కార్డిఫ్‌యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌ వారి ఆధ్వర్యంలో ఈ అధ్యయనం 35 ఏళ్లపాటూ సాగింది.

  • Loading...

More Telugu News