: ఇనుము వెతుకులాటలో గుజరాత్ నేతలు, అధికారులు ఫుల్ బిజీ
గుజరాత్ లో నర్మదానదీ తీరాన నిర్మించనున్న సర్థార్ పటేల్ విగ్రహం తయారీ నిమిత్తం అవసరమయ్యే ఇనుము వేటలో ఆ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిమగ్నమైంది. 182 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు 700 టన్నుల ఇనుము కావాలి. దాన్ని దేశంలోని 5 లక్షల గ్రామాల నుంచి సేకరిస్తున్నారు. దీని కోసం గుజరాత్ బీజేపీ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ ఇనుము దానం చేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ విస్తృతంగా ఇనుము సేకరిస్తున్నారు. 2 వేల కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో తలపెడుతున్న సర్థార్ పటేల్ విగ్రహ నిర్మాణం మార్చిలో ప్రారంభం అవుతుంది.