: జేసీకి మతిపోయింది: ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి మతిపోయిందని నల్గొండ జిల్లా ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మండిపడ్డారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా రాయల తెలంగాణ ఇచ్చివుంటే జేసీకి బాగుండేదని, అలా ఇవ్వకపోవడం వల్లే మంచివారు కాలేకపోయారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జేసీ తప్పుకుని యువకులకు అవకాశమిస్తే మంచిదని ఆయన హితవు పలికారు.