: ఆ ఆరుగురిలో ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు
సౌతాఫ్రికాలోని జోహోన్నెస్ బర్గ్ లో జరుగుతున్న నెల్సన్ మండేలా సంతాప సభలో ప్రపంచ దేశాలకు చెందిన వంద మంది దేశాధినేతలు పాల్గొన్నారు. అయితే అందులో ప్రసంగించే అవకాశం మాత్రం ఆరుగురు మాత్రమే దక్కించుకున్నారు. వారిలో ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్వి బాన్ కి మూన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాలు కీలకోపన్యాసాలు చేయగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, చైనా, బ్రెజిల్, నమీబియా దేశాధి నేతలకు మాత్రమే మండేలా స్మారక ప్రసంగం చేసే అవకాశం లభించింది.