: రాష్ట్రపతి వచ్చాకే బిల్లు అసెంబ్లీకి
సౌతాఫ్రికాలో నెల్సన్ మండేలా సంతాప సభకు హాజరయిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశానికి వచ్చిన తరువాతే తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రానుంది. కాగా రేపు ఉదయం 11 గంటలకు ప్రణబ్ ముఖర్జీ భారత్ తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన తరువాత బిల్లును అసెంబ్లీకి పంపించనున్నారని సమాచారం.