: దివాకర్ రెడ్డి బస్సులు, ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి: శంకర్రావు
మొన్న జరిగిన వోల్వో బస్సు ఘటనతో పాటు జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ఇతర బస్సులు, ఆస్తులపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని మాజీమంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. నెహ్రూ కుటుంబం ఎలాంటిదో అందరికీ తెలుసనీ, అలాంటి కుటుంబానికి చెందిన సోనియాగాంధీపై నోరు పారేసుకోవడం దివాకర్ రెడ్డికి తగదని అన్నారు. ఆయనకు నోరెలా వచ్చిందో... అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు గాంధీ భవన్ లో శంకర్రావు మీడియాతో మాట్లాడారు. జేసీ సంపాదనలపై, పన్ను చెల్లింపులపై సీబీఐతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు. సీఎంతో కలసి జేసీ సోనియాపైనే కామెంట్ చేస్తున్నారని దుయ్యబట్టారు.