: సొంత పార్టీపై అవిశ్వాస తీర్మానం అనైతికం: టీకాంగ్రెస్ ఎంపీలు


కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సీమాంధ్ర ఎంపీలపై టీకాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే, అధిష్ఠానం రాష్ట్ర విభజనకు సిద్ధమైందని... అప్పుడు అందరూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి... ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం అనైతికమని అన్నారు. ఢిల్లీలో టీకాంగ్ ఎంపీలు మందా జనన్నాథం, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సోనియాపై సీమాంధ్ర నేతలు అవాకులు, చెవాకులు పేల్చడం మానుకోవాలని సూచించారు. సొంత పార్టీపై అవిశ్వాసం అంటే తల్లి శవాన్ని కోరుకోవడమేనని చెప్పారు. సమన్యాయం అంటే ఏంటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News