: అసెంబ్లీ పరిధిలో ఆంక్షలు: సీపీ అనురాగ్ శర్మ
అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. శాసనసభ పరిసరాల్లో రెండు కిలోమీటర్ల పరిధి వరకూ ఆంక్షలు విధించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఏపీఎన్టీవోల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంపై ఇంతవరకూ తమకు సమాచారం లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని సీపీ శర్మ హెచ్చరించారు.