: కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై కాసేపట్లో కుండబద్దలు కొట్టనున్న గంటా
మంత్రి గంటా శ్రీనివాసరావు మరికాసేపట్లో పార్టీలో కొనసాగడంపై తన నిర్ణయాన్ని స్పష్టం చేయనున్నారు. పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ పార్టీలో చేరి, మంత్రి పదవి చేపట్టిన గంటా శ్రీనివాసరావు ఆది నుంచీ సమైక్యవాదిగా పేరుగడించారు. ఉద్యమానికి కొమ్ముకాస్తున్నారంటూ సహచరులు ఆరోపించినా, తన నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు ఉద్యమ తీవ్రతను కేంద్ర మంత్రులు, ఎంపీలతో అధిష్ఠానం ముందుకు కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రులను అలక్ష్యం చేయడంతో ఆగ్రహంచిన గంటా తన పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.