: 'కర్రలు దూసిన' వైఎస్సార్సీపీ కార్యకర్తలు


కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. మైలవరం వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేష్, జేష్ఠ రమేష్ బాబుకు చెందిన వర్గీయులు పరస్పరం కర్రలతో దాడులకు తెగబడ్డారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రెండు వర్గాలు మైలవరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ప్రధాన కూడలిలో ఎదురుపడి ఒకరికి పోటీగా మరొకరు నినాదాలు చేశారు. ఇది వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News