: కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవలసిందే: మణిశంకర్ అయ్యర్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టి కరవడంతో సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆ పార్టీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇంత ఓటమి మూటగట్టుకున్నాక ప్రతిపక్షంలో కాంగ్రెస్ కూర్చోవలసిందేనన్నారు. అప్పుడే ఆత్మపరిశోధన చేసుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు. కాగా, 2009లో మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా ఎంపికచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకొని ఉండాల్సిందన్నారు.