: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కోలీపై లైంగిక వేధింపుల కేసు


ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎమ్మెల్యే ధర్మేంద్ర కోలీపై కాంగ్రెస్ పార్టీ నేత వీర్ సింగ్ దింగన్ భార్య లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఆదివారం అసెంబ్లీ ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన విజయోత్సవ ర్యాలీలో, కోలీ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. సీమాపురి నియోజకవర్గంలో దింగన్ పై ధర్మేంద్ర కోలీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ ఆయన తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ఖండించారు. ఇదిలా ఉండగా, తమ పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను పరిశీలిస్తున్నామని ఏఏపీ నేత మనీష్ సిసోడియా తెలిపారు. ఇది కోలీపై జరిగిన రాజకీయ కుట్ర అని సిసోడియా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News