: ప్రస్తుత సమావేశాల్లోనే లోక్ పాల్ కు ఆమోదం: నారాయణసామి
అన్నా హజారే జన్ లోక్ పాల్ బిల్లు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో యూపీఏ ప్రభుత్వంలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన జన్ లోక్ పాల్ బిల్లు రాజ్యసభ ముందు పెండింగులో ఉంది. ఈ బిల్లుకు ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర సహాయ మంత్రి నారాయణ సామి చెప్పారు. రాజ్యసభ నడిచేలా సహకరిస్తేనే ఇది సాధ్యమన్నారు. జన్ లోక్ పాల్ బిల్లు కోసం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే ఈ రోజు ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభంజనం కూడా యూపీఏ ప్రభుత్వ వైఖరిలో మార్పునకు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.