: ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది: కే్జ్రివాల్
బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీనేత అరవింద్ కేజ్రివాల్ సహా పలువురు ఈ ఉదయం ఢిల్లీ కోర్టు ఎదుట హాజరయ్యారు. అనంతరం కేజ్రివాల్ మాట్లాడుతూ, ఈ కేసులో బెయిల్ పొందేందుకు ప్రయత్నించమనీ, జైలుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామనీ చెప్పారు. అయితే, ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు నమోదు చేసిందని ఆయన ఆరోపించారు. గత ఆగస్టులో ఢిల్లీలో ప్రధాని నివాసం ఎదుట కేజ్రివాల్ తన కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో వారు అక్కడి నిబంధనలను ఉల్లంఘించారు. దాంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.