: మేం సమైక్యాంధ్రకు అనుకూలం.. గెలిచింది కాంగ్రెస్ వ్యతిరేకత: మమతాబెనర్జీ
మేం సమైక్యాంధ్రకు అనుకూలమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రాంతీయ పార్టీల సమయం ఆసన్నమైందని, ఢిల్లీ గద్దెపై ప్రాంతీయ పార్టీలు జెండా పాతాలని పిలుపునిచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో విజయం ఎవరి గొప్పదనం కాదంటూ బీజేపీ ఘనతను కొట్టిపడేసిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్ వ్యతిరేక పవనాలే విజయం సాధించాయని స్పష్టం చేశారు. పార్లమెంటులో సొంత పార్టీపై కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. గ్యాసు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో వంటగది మండుతోందని దీదీ మండిపడ్డారు.