: గోల్కొండ కోటలో ఆటోడ్రైవర్ దారుణహత్య
భాగ్యనగరంలోని గోల్కొండ కోట పరిసర ప్రాంతంలో ప్రత్యర్థులు ఆటో డ్రైవర్ యాసిన్ ను దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పంచనామా నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.