: లోక్ సభ రేపటికి వాయిదా.. సభ ముందుకు వచ్చిన అవిశ్వాస తీర్మానం
లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఆంధ్రా ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ ను స్పీకర్ మీరా కుమార్ స్వీకరించారు. అయితే సభ నినాదాలతో హోరెత్తుతుండటం, సభ్యులందరూ ఆర్డర్ లో లేకపోవడంతో... సభను వాయిదా వేశారు. దీంతో రేపు సభ ప్రారంభం కాగానే, ఆంధ్రా ఎంపీల అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. దీనికి తోడు స్పీకర్ పై బీజీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా ఉండటంతో... రేపు ఏ అవిశ్వాస తీర్మానం ముందు వస్తుందో వేచిచూడాల్సిందే. అయితే ఎక్కువ శాతం స్పీకర్ పై అవిశ్వాస తీర్మానమే ముందు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.