: ఫోనే కానీ.. పీసీ వేగంతో పోటీ


కొరియా కంపెనీ శామ్ సంగ్ మరో పంచ్ లాంటి మొబైల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని పేరు గెలాక్సీ-జె. దీని వేగం, సామర్థ్యం పీసీకి పోటీనిచ్చేలా ఉన్నాయి. ఇందులో 2జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 800 సీపీయూ , 13 మెగాపిక్సెల్ కెమెరా, 5 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 2,600 మిల్లీ యాంపీ అవర్స్ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ధర మాత్రం సుమారుగా 45వేల రూపాయలు. మన మార్కెట్లోకి ఎప్పుడు ప్రవేశపెట్టేదీ కంపెనీ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News