: ఎంపీ అనంత ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
అనంతపురంలో కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నివాసాన్ని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు ముట్టడించారు. యూపీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి ఎంపీ మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.