: సీఎం కిరణ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై చర్చించడానికి... సీఎం కిరణ్ నేతృత్వంలో సచివాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కోదండరెడ్డి, మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. టీడీపీ తరఫున కోడెల శివప్రసాద్, రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. సీపీఐ తరఫున నారాయణ, రామకృష్ణ, మల్లేష్, లోక్ సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. సీపీఎం నుంచి రాఘవులు, జూలకంటి హాజరయ్యారు. అలాగే బీజేపీ నుంచి శేషగిరిరావు, నాగం, టీఆర్ఎస్ నుంచి వినోద్, విద్యాసాగర్ రావు హాజరయ్యారు. వైకాపా నుంచి కొణతాల రామకృష్ణ, శోభా నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశం దాదాపు గంటసేపు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.