: కాంగ్రెస్ ను గద్దె దించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది: సీమాంధ్ర టీడీపీ ఎంపీలు
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు అన్నారు. అందుకే యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలిపారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీ మోదుగుల నివాసంలో భేటీ అయిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పొందేందుకు, కాంగ్రెసేతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని వారు తెలిపారు. బాధ్యత గల అన్ని పార్టీలు అవిశ్వాసానికి మద్దతు పలకాలని కోరుతున్నామని చెప్పారు. సభలో అవిశ్వాస తీర్మానానికి కచ్చితంగా మద్దతు లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతిపాలు చేసిందని విమర్శించారు.