: ఎల్లుండి నుంచి శాసనసభ సమావేశాలు
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో రేపు శాసనసభ వ్యవహారాల సంఘం భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అజెండాను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో, ఈ సమావేశాలు అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్ర చరిత్ర గతిని మార్చే ఈ సమావేశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై, ఇప్పటికే ఇరు ప్రాంతాల నేతలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత వాడిగా, వేడిగా జరగనున్నాయి.