: మధ్యాహ్నం ఒంటి గంటకు షిండే ప్రెస్ మీట్
కేంద్ర హోంమంత్రి షిండే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పురోగతిపై ఆయన మీడియాకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో, షిండే ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.