: ఈ రోజు నుంచి అన్నా హజారే నిరవధిక దీక్ష
జనలోక్ పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఉన్న ఓ ఆలయంలో ఆయన దీక్ష మొదలవుతుంది. అన్నా అభిమానులు, అక్కడి స్థానికులు ఈ దీక్షలో పాల్గొంటారు. జనలోక్ పాల్ బిల్లును తీసుకురాకుండా జాప్యం చేస్తున్న కాంగ్రెస్ ను మరోసారి ఇరకాటంలో పెట్టి బిల్లును సాధించుకోవడమే అన్నా లక్ష్యం.