: మంచి తరుణం మించిన దొరకదు... 11-12-13 కౌంట్ డౌన్ స్టార్ట్
ప్రారంభోత్సవాలు, విజయోత్సవాలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మంచి తరుణం మించిన దొరకదు.. ఎప్పుడో కాదు ఎల్లుండే.. అవును, బుధవారం 11-12-13.. 11వ తేదీ, 12వ నెల, 13వ సంవత్సరం వస్తోంది. ఆరోహణ క్రమంలో ఉన్న ఆ తారీఖున ఏదైనా పని ప్రారంభిస్తే శుభసూచకమని, తప్పక విజయం సాధిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు వెల్లడించారు. బుధవారం సరిగ్గా, 14 గంటల 15 నిమిషాల 16 సెకన్ల సమయం సూపర్ గా ఉంటుందని నొక్కి చెబుతున్నారు. అయితే, జ్యోతిషశాస్త్ర రీత్యా మాత్రం దీనికి ఎలాంటి ప్రాముఖ్యత లేదని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. అయినా విజయం దిశగా దూసుకెళ్లే కొంతమంది యువకులు మాత్రం ఇప్పటికే వైవిధ్యభరిత కార్యక్రమాలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. సో, మీరు కూడా రెడీ అయిపోండి మరి..!