: బీజేపీకి అంత సీన్ లేదు.. ప్రాంతీయ పార్టీలదే హవా: కుమారస్వామి
నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించినా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ప్రభావమేమీ లేదని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కుమారస్వామి పాల్గొన్నారు. కాంగ్రెస్ తప్పుడు విధానాల కారణంగానే ఓటమి పాలయిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి కలిసివచ్చిందని అన్నారు. ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపే చూస్తున్నారనడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఆయన ఉదాహరించారు. అక్కడ అమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలకే ప్రజలు మద్దతు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు.