: ఆరో అభ్యర్ధి ప్రకటనపై పీసీసీ ఎదురుచూపులు


ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేడు తుది గడువు కావడంతో ఆరో అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఆరో అభ్యర్ధిని నిలబెట్టేందుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ బొత్స ఢిల్లీ పర్యటనలో అధిష్ఠానాన్ని కోరారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో పీసీసీ ఎదురు చూస్తోంది. హైకమాండ్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ మధ్యాహ్నం ఆరో అభ్యర్ధి పేరును ప్రకటించనున్నారని సమాచారం. అధిష్ఠానం ఆమోదంతో ఐదుగురు అభ్యర్ధుల పేర్లను పీసీసీ నిన్నప్రకటించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News