: అవిశ్వాస తీర్మానంతో యూపీఏను ఇంటికి పంపండి: చంద్రబాబు
పార్లమెంట్ సభ్యులు అవిశ్వాస తీర్మానంతో యూపీఏ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అవినీతి కనుమరుగు కావాలన్నా.. పారదర్శక పాలన రావాలన్నా.. కాంగ్రెస్ ను వెళ్లగొట్టాలని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం యూపీఏ సర్కారు వెంటిలేటర్ పై ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. హైదరాబాదులో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ సాధారణ వ్యక్తి ఢిల్లీ ఎన్నికల్లో సీఎంపై ఘన విజయం సాధించారని చెబుతూ, ఈ సందర్భంగా కేజ్రీవాల్ ను బాబు అభినందిస్తున్నానన్నారు.