: తిరుమలలో జనవరి 11న వైకుంఠ ఏకాదశి వేడుకలు
ప్రముఖ హైందవ పుణ్యక్షేత్రం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 11వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిపేందుకు నిర్ణయించినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల వెంకన్న ఆలయంలో ప్రతి ఏటా వచ్చే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు విశిష్టత ఉంది. స్వామి వారి సన్నిధిలోని విమాన ప్రాకారంలో ఏడాది పొడవునా మూసేసి ఉండే వైకుంఠ ద్వారాలను ఆ రెండు రోజులు తెరచి ఉంచుతారు. ఇందులో భాగంగా జనవరి 11, 12 తేదీల్లో మూలవిరాట్టును దర్శించుకునే భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి ప్రవేశం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.