: అవిశ్వాస తీర్మానాన్ని సమర్థంగా ఎదుర్కొంటాం: పీసీ చాకో
సీమాంద్ర ఎంపీల అవిశ్వాస తీర్మానం నోటీసుపై కాంగ్రెస్ అధికార ప్రతినిథి పీసీ చాకో స్పందించారు. అవిశ్వాస తీర్మానం ఊహించని పరిణామమైనా.. సమర్థంగా అధిగమిస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం సభ ముందుకు వచ్చినప్పుడు చర్చిస్తామన్న చాకో.. సరైన సమయంలో మాట్లాడకుండా, నిర్ణయం తీసుకున్నాక ఎంపీలు ఇలా చేయడం సరికాదన్నారు. పార్టీ సభ్యుల్లో భిన్నాభిప్రాయాలున్నా తెలంగాణపై అధిష్ఠానం బాహాటంగానే నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మాన ఫలితం ఏమిటనేది ముఖ్యమని, మిగతావన్నీ యథావిధిగా జరుగుతాయనీ అన్నారు.