: అవిశ్వాసానికి పెరుగుతున్న మద్దతు.. స్పీకర్ కు వైఎస్సార్సీపీ ఎంపీల నోటీసు
రాష్ట్ర విభజనను ముందుకు తీసుకెళుతున్న కాంగ్రెస్ సర్కారును గద్దె దించేందుకు సీమాంధ్ర పార్టీల నేతలు ఏకమవబోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్, నలుగురు టీడీపీ ఎంపీలు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసానికి లోక్ సభ స్పీకర్ కు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ వరసలో వైఎస్సార్సీపీ కూడా చేరింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా యూపీఏపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. తీర్మానంపై సంతకాలు చేసి స్పీకర్ కార్యాలయానికి పంపారు. దాంతో, మద్దతు సంఖ్య పదమూడుకు చేరింది.