: విజయోత్సవాల్లో బీజేపీ కార్యకర్తలు... ఆనంద డోలికల్లో ‘ఆప్’ నేతలు


ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మిజోరాం మినహా మిగతా నాలుగు చోట్ల కమలం వికసించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీని విజయం వరించింది. ఇక హస్తినలోనూ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాల బీజేపీ కార్యకర్తలు ఆనందంతో సంబరాలు చేసుకొన్నారు. బీజేపీ పాలిత ప్రభుత్వాలే మళ్లీ గెలవడంతో తమకు జనామోదం పెరిగిందని కమలనాథులు అంటున్నారు. మూడు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులకు ప్రధాని మన్మోహన్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఢిల్లీలో బీజేపీ, అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయ ఢంకా మోగించడంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాము బీజేపీకి మద్దతిచ్చేది లేదని, సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. జనామోదంతో అవసరమైతే మళ్లీ ఎన్నికలకు సిద్ధమని ఆయన అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆప్ పోటీచేస్తుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News