: తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న అశోక్ బాబు అరెస్టు
హైదరాబాదులోని సచివాలయం తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన ఏపీఎన్జీవోల సంఘం అద్యక్షుడు అశోక్ బాబు సహా పలువురు నేతలను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు ఏపీఎన్జీవోలు సోనియా, రాహుల్ గాంధీల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.