: మిజోరాంలో మళ్లీ అధికారం కాంగ్రెస్ కే!.. రెండు చోట్ల సీఎం గెలుపు
మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 16 స్థానాల్లో గెలిచి.. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 40 స్థానాల అసెంబ్లీలో 21 చోట్ల విజయం సాధిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లభించినట్లే. మిజోరాం డెమొక్రటిక్ అలయెన్స్ రెండుచోట్ల గెలుపొందగా.. మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేసిన రెండు స్థానాలు సెర్చిప్, హ్రంగ్ టుర్జోలో గెలుపొందారు.