: పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఇవాళ పార్లమెంట్ హాలు మార్మోగిపోయింది. ఉదయం నుంచి రెండు సార్లు వాయిదా పడిన అనంతరం రెండు గంటలకు లోక్ సభ ప్రారంభమైంది. స్పీకర్ మీరా కుమార్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.