: యూపీఏను కూల్చడానికి రాజీనామాలు ఉపసంహరించుకున్న ఎంపీలు


ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవడానికి వీలుగా యూపీఏ ప్రభుత్వాన్ని కూల్చడమే ఏకైక పరిష్కారంగా భావించిన సీమాంధ్ర ఎంపీలు అందుకు వీలుగా తమ రాజీనామాలు ఉపసంహరించుకున్నారు. ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, సాయి ప్రతాప్ గతంలో రాజీనామాలు చేసి ఉన్నారు. వీరి రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగులో ఉన్నాయి. రాజీనామాలు పెండింగులో ఉండగా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదని తెలియడంతో.. అందుకోసం ఈ నలుగురు ఎంపీలు తమ రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నామని స్పీకర్ మీరా కుమార్ కు తెలియపరిచారు. మరోవైపు సొంత ప్రభుత్వాన్నే కూల్చడానికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సిద్ధం కావడం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే ఏడుగురు ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చారు. వీరికి ఇంకెంతమంది జత కలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎస్పీ, బీఎస్పీ వెలుపలి మద్దతుతో కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న యూపీఏను... సీమాంధ్ర ఎంపీల నిర్ణయం కలవరపాటుకు గురిచేసేదే. ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గితే కాంగ్రెస్ కు ఇంతకంటే అప్రదిష్ఠ మరొకటి ఉండదు.

  • Loading...

More Telugu News