: బుడబుక్కల వేషంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్


కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తన ఆగ్రహాన్ని టీడీపీ ఎంపీ శివప్రసాద్ బుడబుక్కల వేషంలో వ్యక్తపరిచారు. పార్లమెంటులో సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో హోరెత్తించిన తర్వాత సభలు వాయిదాపడడంతో.. టీడీపీ ఎంపీలు బయటకు వచ్చి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో శివప్రసాద్ బుడబుక్కల వేషంతో చిన్న డోలు పట్టుకుని అటూ ఇటూ ఊపుతూ పైన గొడుగు వేసుకుని పద్యాలు పాడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

అమ్మ పలుకు జగదంబ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, తిరుపతి పద్మావతి అమ్మ పలుకు.. అంటూ పాడుతూ.. సోనియాకు, రాహుల్ కు దోషం ఉందని గతంలో ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని.. ఇప్పుడేమైంది.. రాజస్థాన్ లో ఫెయిల్, మధ్య ప్రదేశ్ లో ఫెయిల్.. ఛత్తీస్ గఢ్ లో ఫెయిల్ అంటూ వివరించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అహ్మద్ పటేల్ ను గుజరాత్ కు, దిగ్విజయ్ సింగ్ ను మధ్య ప్రదేశ్ కు, చిదంబరాన్ని తమిళనాడుకు తరిమి తరిమి కొట్టాలని కోరారు. లేకుంటే సోనియాకు ఆమె కుమారుడు రాహుల్ కు ఇదే గతి అంటూ తాజా ఎన్నికల ఫలితాలను పరోక్షంగా గుర్తు చేశారు. జానపద కళలను తక్కువ చేసి చూడరాదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News