: శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
అనారోగ్యం కారణంగా బెయిల్ గడువు పొడిగించాలని కోరుతూ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి (సస్పెండైన) దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అటు ఓఎంసీ కేసులో జైల్లో ఉన్న బి.వి శ్రీనివాసరెడ్డి పిటిషన్ పై విచారణను న్యాయస్థానం 14వ తేదీకి వాయిదా వేసింది. కొన్ని రోజుల కిందటే ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిని విచారించేందుకు సీబీఐ అధికారులకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే.