: కనిపించని సోనియా పుట్టిన రోజు కళ.. నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 67వ జన్మదినోత్సవం వెలవెలబోతోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడడంతో పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. దీంతో అధినేత్రి పుట్టిన రోజు సంబరాల పేరుతో ఏటా హడావిడి చేసే పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఈసారి మూగబోయారు. అయితే, వారు ఇందుకు నెల్సన్ మండేలా సంతాప దినాలను సాకుగా పేర్కొంటున్నారు. మరోవైపు సోనియా పార్లమెంటుకు చాలా ఆలస్యంగా వచ్చారు.

  • Loading...

More Telugu News