: థాయ్ లాండ్ పార్లమెంట్ రద్దు.. త్వరలో ఎన్నికలు
తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న థాయ్ లాండ్ ప్రధాని యింగ్ లుక్ షినవ్రత ఆ దేశ పార్లమెంట్ ను రద్దు చేశారు. ఈ మేరకు టీవీ ప్రసంగం ద్వారా ఓ ప్రకటన చేశారు. సాధారణ ఎన్నికలు జరిపేందుకు త్వరలో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అటు పార్లమెంటు రద్దు నిర్ణయానికి రాజకుటుంబం ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీ ఎంపీలంతా పదవులకు రాజీనామా చేసి దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనాలని నిర్ణయించడం, ప్రధానిని గద్దె దింపాలని ఆందోళనకారులు ఈ రోజు అక్కడి ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సిద్ధమైన నేపథ్యంలో థాయ్ పార్లమెంట్ ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.