: సీఎం కిరణ్ పై సోనియాకు తెలంగాణ ఎంపీల ఫిర్యాదు
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు అధినేత్రి సోనియాకు ఫిర్యాదు చేశారు. శనివారం పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం విజయవాడ సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ సమైక్య రాష్ట్రానికి మద్దతుగా మాట్లాడడంతో తెలంగాణ ఎంపీలు సోనియా దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ రోజు పార్లమెంటు ఉభయ సభలు గంటపాటు వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో సోనియాను కలుసుకుని తెలంగాణలో రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. అలాగే అధినేత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.