: అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు
హైదరాబాదులో అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఉప్పల్ విజయపురి కాలనీలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఓ కేంద్రంపై ఈ ఉదయం అనూహ్యంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో 240 మద్యం సీసాల పెట్టెలు, 35 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మద్యం వ్యాపారి బజారు పాండు గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.