: పార్లమెంటు ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
పార్లమెంటు ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ముందుగా లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంద్ర నినాదాలు చేయడంతో స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభలో.. నవంబర్ లో ఇస్రో చేపట్టిన 'మంగళయాన్ ప్రయోగం' విజయవంతం కావడంపై ఛైర్మన్ హమీద్ అన్సారీ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు.