: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన?


దేశ రాజధానిలో రాజకీయ అస్థిరత ఏర్పడింది. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు ఈ పార్టీకి ఇంకా నాలుగు స్థానాలు కావాలి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు సంపాదించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 8 స్థానాలతో చలికిలపడింది. తాము ఏ పార్టీకి మద్దతివ్వబోమని, తీసుకోబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అంతేకాదు ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ మరో నేత యోగేంద్ర యాదవ్ అయితే, బీజేపీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానికి తాము మద్దతిచ్చేది లేదన్నారు. అంతేకాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పారు.

బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ మాట్లాడుతూ తమకు సహజ పద్ధతుల్లో మద్దతు లభిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, లేకుంటే ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పారు. మరి బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతివ్వదు, కాంగ్రెస్- బీజేపీ కలవడం అసాధ్యం. ఇక మిగిలింది రెండు స్వతంత్ర అభ్యర్థుల స్థానాలు. ఈ రెండు బీజేపీకి జతకలిసినా ఇంకా రెండు స్థానాలు కావాల్సి ఉంటుంది. కనుక ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ అన్నీ ప్రతిపక్ష స్థానాలకే పరిమితమైతే మిగిలిన ఏకైక పరిష్కారం రాష్ట్రపతి పాలనే. ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి చూడబోతుంటే దానికే దారితీసేలా ఉంది!

  • Loading...

More Telugu News