: కేజ్రీవాల్ నివాసంలో ఏఏపీ నేతల సమావేశం
పార్టీ పెట్టిన సంవత్సరంలోనే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) 28 సీట్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉదయం పార్టీ నేతలు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. ఢిల్లీలో 32 సీట్లు గెలుచుకుని తొలి స్థానంలో ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని విధంగా ఉంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణపై ఏఏపీ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.