: ప్రపంచంలోనే అతి పల్చటి కండోం
అత్యంత పలచటి కండోంను తయారుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ప్రస్తుతానికి జపాన్‌లోని సాగామి రబ్బర్ ఇండస్ట్రీస్ వారు ఈ విషయంలో పురోగతి సాధించారు. మనిషి కేశాలకంటె అతి పలచంగా ఉండే రబ్బరుతో వారు కండోంను రూపొందించారు.
దాదాపుగా పదేళ్లపాటూ సుమారు 20వేల వివిధ కండోంలను పరిశీలించిన సాగామి రబ్బర్ ఇండస్ట్రీస్‌లోని ఇంజినీర్లు, చివరికి 0.01 ఎంఎం మందం కలిగిన ఈ కండోంను రూపొందించారు. పైగా ఇది పూర్తిస్థాయిలో పనిచేస్తుందని కూడా వారు సర్టిఫై చేస్తున్నారు. దాన్ని పోల్చిచూడాలనుకుంటే గనుక.. మనుషుల వెంట్రుక 0.06 ఎంఎం మందంగా ఉంటుంది.
'ప్రస్తుతానికి ఇంతకంటె పలచటి కండోం తయారుచేయడం ఎలాగో మాకు అర్థం కాలేదు. అయితే.. మరింత పలచగా ఉండడం యొక్క అవసరం పెరుగుతున్నంత వరకు ఇంకా మేం 0.009 మరియు 0.008 ఎంఎం మందంతో కండోంలను తయారుచేస్తూనే ఉంటాం' అని సాగామి ఇంజినీర్లు చెబుతున్నారు. సాగామి 0.01 ఎంఎం పలచగా ఉండడం నిజమే కానీ.. దాని ధర మాత్రం ఒక్కొక్కటి 12 డాలర్లుట!!