: అక్కడ శిలలను ఆమూలాగ్రం శోధిస్తున్నారు


అంగారకగ్రహంపై భారతీయ అన్వేషణ ఇంకా మొదలు కాలేదు. అయితే గత ఏడాదినుంచి అక్కడి పరిస్థితుల్ని బేరీజు వేస్తున్న నాసా వారి రోవర్‌ క్యూరియాసిటీ.. సరికొత్త ఆవిష్కరణలకు తన వంతు ప్రయత్నాలు చేస్తూ పోతోంది. అంగారకగ్రహంపై నివాసయోగ్య పరిస్థితుల అంచనాకు వెళ్లిన క్యూరియాసిటీ.. అక్కడి శిలల లక్షణాలను పరిశీలించేందుకు వీలుగా తరచూ కొన్ని లేజర్‌ కిరణాలను పేలుస్తూ, వాటి ద్వారా అవి ఆవిరయ్యేలా చేస్తూ.. తద్వారా ఆ ఆవిరిలో ఎలాంటి పదార్థాల లక్షణాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

గత ఏడాదినుంచి నిర్విరామంగా పనిచేస్తున్న క్యూరియాసిటీ తాజాగా లక్షవ సారి లేజర్‌ కిరణాలను శిలల మీదికి ప్రయోగించి వాటి లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. క్యూరియాసిటీ తన ప్రస్థానంలో అనేక కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నట్లుగా నాసా శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు.

  • Loading...

More Telugu News