: దంతక్షయాన్ని నివారించే క్యాండీ రూపకల్పన
అవును, మీరు చదువుతున్నది కరక్టే. దంతక్షయాన్ని నివారించే.. దంత సౌభాగ్యాన్ని పరిరక్షించే ఒక కొత్తరకం క్యాండీని సైంటిస్టులు రూపొందించారు. చాక్లెట్లను అతిగా ఇష్టపడే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే.. చాక్లెట్ క్యాండీలు అతిగా తినడం వలన.. దంతక్షయానికి దారితీస్తుందని ఇక ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాండీల వలన పళ్లపై ఏర్పడే బ్యాక్టీరియాను గరిష్ఠంగా తగ్గించి వేసే.. షుగర్ ఫ్రీ క్యాండీలను సైంటిస్టులు రూపొందించారు.
బెర్లిన్ బయోటెక్ ఫర్మ్ వారు రూపొందించిన ఈ క్యాండీ.. పళ్లలో కావిటీలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వీలైనంత వరకు దూరం ఉంచుతుందని నిర్ణయించారు. మామూలుగా అయితే.. క్యాండీలు తిన్న తరువాత.. పళ్ల ఉపరితలంపై అతుక్కుపోయిన బ్యాక్టీరియా కొన్ని రకాల ఆమ్లాలను విడుదల చేస్తుంది. అవి పళ్లమీద ఉండే ఎనామెల్ ను దెబ్బతీసి.. కావిటీలకు కారణం అవుతాయి. అయితే ఇలాంటి బ్యాక్టీరియాలు లేని క్యాండీలను రూపొందించడం ద్వారా దంతక్షయం ప్రమాదం ఉండకుండా కొత్త చాక్లెట్ పరిశోధనలు ఫలితం ఇచ్చాయన్నమాట.