: తెలివి పేరుతో మానవజాతిది ఆత్మవంచన
జంతువులకంటె తాము తెలివైన వాళ్లమని చెప్పుకుంటూ మానవ జాతి కొన్ని వేల సంవత్సరాలుగా తమను తాము మోసం చేసుకుంటూ బతుకుతున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ, తెలివితేటల విషయంలో జంతుజాలాన్ని బేరీజు వేసినప్పుడు ఈ విషయం వాస్తవం కాదని తేలుతోందని యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్‌లోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ ఆర్థర్ శానియోటిస్ అంటున్నారు.
అయితే, మనుషులకంటె మెరుగైన లక్షణాలు కొన్ని జంతుజాలంలో ఉన్నట్లు సైన్సు మనకు చెబుతోందని ఆయన అంటున్నారు. నిజానికి మిగిలిన జంతుజాలానికంటె తెలివైన వారం అనే భ్రమ మనలో వ్యవసాయంతో మొదలైందని.. ఆ తరువాత క్రమంగా వ్యవస్థీకృత మతంగా మారడంతో అలా చెలామణీ అయిపోయిందని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంటున్నారు. భిన్నమైన అనేక రకాల తెలివితేటలు జంతువులకు ఎక్కువగానే ఉన్నాయని, అయితే వాటిని మరుగున పెట్టేశారని అంటున్నారు.